Monday, December 8, 2008

యువతా మేలుకో

దేశంలో యువత 70 శాతం అంటే 35 సం వత్సరాల లోపు వారు 100కి 70 మంది. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత దేశం. కాని ఇంకా కడు పేద దేశంగానే మిగిలి ఉంది. ఎందుకంటే యువశక్తి మొత్తం రక రకాల కులాలుగా వర్గాలుగా ప్రాంతీయ తత్వంతో విడిపోవడమే కారణం.
కొంత మంది తమ స్వార్థం కొరకు యువతను విడదీసి, వారి పబ్బం గడుపుకొంటున్నారు అన్నది నిజం. యువత యేకమైతే వారి ఆటలు సాగవన్నది సత్యం. దేశం పేదరికంలో ఆకలి చావులతో నిండి వుండడానికి కారణం యువత అనైక్యతే.
అటువంటి యువతను సమైక్య పరచి వర్గ ప్రాంత విభేదలకు అతీతంగా ఏక త్రాటిపై నడిపించాలనే ఆశయంతో యువమైత్రి ఆరంభిప బడింది.
అనుకున్న ప్రకారం ఆరంభించిన నాటి నుండి యువ మైత్రి నేటి వరకు కొన్నింట విజయాలు సాధించామని తెలియ జేయడానికి ఆనందంగావుంది. ఈ రోజు వైజాగ్ జిల్లా వ్యాప్తంగా " యూత్ వాయస్ నెట్ వర్క్ " పేరుతో కార్య క్రమాలు చేపడుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో యువ మైత్రిని పెంపొందించి, తద్వారా సామాన్య ప్రజా హితం కొరకు పని చేయడానికి రండి, చేతులు కలపండి.
కలిసి నడుద్దాం. సమైక్య నవ భారతి నిర్మిద్దాం.
జై భారత్.

No comments: