Wednesday, December 10, 2008

గాంధేయుల బ్రాందీ వాదము

గాధేయులమా బ్రందేయులమా ?
" నాకు ఒక్కరోజు అధికారమిస్తే ఈ దేశంలో మద్యం లేకుండా చేస్తాను "
అన్నాడు ఆనాడు మహత్ముదు.
మేమంతా గాంధేయులం అంటున్నారు ఈనాడు కొందరు. కాని
ప్రస్తుత పరిస్తితి అందుకు విరుద్ధంగా ఉన్నది.
సాలీన 20 వేల కొట్ల రూపాయల మధ్యం మన రాష్ట్రం లో అమ్ముడవుతున్నది. అందులో 6.5 వేల కొట్లు మాత్రమే ఖజానాకు జమ అవుతున్నది. మిగిలిన 13.5 వేల కొట్లు స్వాహా కాబడుతున్నది.
దీనిని ప్రజా సంక్షేమం అంటున్నారు. ( సంక్షేమమా లేక సంక్షోభమా ? )
విషమిచ్చి చంపితే దానిని హత్య అంటున్నారు. అదే మధ్యమనే విషాన్ని విచ్చలవిడిగా అమ్మితే అది ప్రజసంక్షేమం అంటున్నారు. ఏది నీతి ? ఏది న్యాయం ? ఎవరు సిక్షింపబడాలి ?
ఇంతకూ
ఎవరు గాంధేయ వాదులు ?
సమాజానికి విషాన్ని పంచి కోట్లు గడిస్తున్నవారా ?
విచ్చలవిడిగా మధ్యం అమ్ముకోవడానికి అనుమతించిన వారా ?
కులమతాలను ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నవారా ?
మారణ హోమం జరుగుతున్నా పదవుల కోసం పోట్లాడుకుంటున్నవారా ?
ఎవరు గాధేయ వాదులు ?
" మద్యం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. నిస్సత్తువ కు కారణమవుతుంది. చివరికి మనిషి జీవచ్ఛవం అవుతాడు. " _ మహాత్మా గాంధి
ఈరోజు మద్యం పసిపిల్లలకు కూడ అందుబాటులో ఉంచారు. మద్య నిషేధంలో గుజరాత్ అందరకు ఆదర్శం.
ప్రస్తుత పరిస్తితిపై యువ మైత్రి గొంతు విప్పడానికి సిద్ధమవుతున్నది. త్వరలోనె ఆ వివరలను మీకు అందిస్తాము. మీ సలహాలు సూచనలు తప్పక మేము స్వీకరిస్తాము.
జై భరత్.

No comments: