Wednesday, December 10, 2008

యువ మైత్రీ నివేదన

ఆత్మ బంధువులారా !
మన కార్యక్రమాల వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
ఇంతవర్కు యువ మైత్రి ని ఆరంభించి సుమరు నాలుగు సంత్సరాల కాలం గడచింది 20 మంది యువకులతో ఆరంభమైన యువ మైత్రి ఈ రోజు జిల్ల వ్యాప్తం గా సుమారు 40 యువజ సంఘాలతో 22 మండలాలలో వాయిస్ యూత్ నెట్ వర్క్ గా రూపాంతరం చెంది పని చేస్తోంది.
సుమారు 400 మంది యువతతో పలు కర్యక్రమాలు చేస్తూ క్రితం సంవత్సరం మాన్యశ్రీ రాష్ట్ర గవర్నర్ వారి చేతులమీదుగ ఉత్తమ సేవ పురస్కారమును అందుకున్నాము అని చెప్పడానికి ఆనందిస్తున్నాము.
అదే విధంగా మా గ్రామ పాఠశాల సుమారు 8 సంవత్సరాల నుండి శిధిలావస్తకు చేరుకున్నా అధికారుల నిర్లక్ష్యానికి గురి కావడం వలన యువ మైత్రి స్పందించి 3 రోజుల నిరాహార దీక్ష ద్వార అధికారులలో స్పందన కలిగించగలిగింది. తద్వార పాఠశాలకు 45 లక్షల రూపాయల గ్రాంట్ ప్రభుత్వం అందించింది .
మహాత్ముని బాటను దేశం మరచిందనే చెప్పాలి . అందుకు గాను గాంధి మార్గాన్ని ఎన్నుకొని యువ మైత్రి యువతలో మహాత్ముని మార్గాన్ని నింపాలని కృషి చేస్తున్నది.
ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపధ్యాయులను సత్కరించడము , గ్రామ పారిసుధ్యము నకు కృషి చేయడము ఇటువంటి పలు కార్యక్రమములతో ప్రజా బాహుళ్యం లోనికి యువ మైత్రి దూసుకు పోతున్నది. అంతే కాకుండ సమాజం లోని పలురకాల రుగ్మతలపై పోరాటం కూడ కొనసగిస్తున్నది. మీ సహకారాన్ని మేము ఏ విధముగా అందుకోగలము. మీ సలహాలు సూచనలకు స్వాగతం.
జై భారత్

No comments: